Header Banner

ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఈ ఆరు రైళ్ల రద్దు, మరికొన్ని దారిమళ్లింపు!

  Fri Feb 07, 2025 09:59        Travel

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆరు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్‌ సెక్షన్‌ ప్రారంభించేందుకు నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపట్టారు.. ఈ కారణంగా ఈ నెల 8న ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ-రాజమహేంద్రవరం (67202), రాజమహేంద్రవరం-విజయవాడ (67201), కాకినాడ పోర్టు-విజయవాడ(17258), విజయవాడ-కాకినాడ పోర్టు(17257), రాజమహేంద్రవరం-విజయవాడ (67261), విజయవాడ-రాజమహేంద్రవరం (67262) రైళు శనివారం ( ఫిబ్రవరి 8వ తేదీన) రద్దు చేశారు. 

 

ఇవాళ (ఫిబ్రవరి 7వ తేదీన) బెంగళూరు-గౌహతి (12309), సీఎస్‌టీ ముంబై-భువనేశ్వర్‌ (11019) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. టాటా-బెంగళూరు (12889), ధన్‌బాద్‌-అలప్పుజ (13351), సంత్రాగచి-చెన్నై సెంట్రల్‌ (22807), షాలిమార్‌-చెన్నైసెంట్రల్‌ (12841), షాలిమార్‌-హైదరాబాద్‌ (18045) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అలాగే శనివారం( ఫిబ్రవరి 8వ తేదీన) గుంటూరు-విశాఖపట్నం (17239), సికింద్రాబాద్‌-సంత్రాగచి (07221), లింగంపల్లి-విశాఖపట్నం (12806), చెన్నైసెంట్రల్‌-షాలిమార్‌ (12842) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. కాకినాడ పోర్టు-ఎల్‌టీటీ ముంబై (17221), విశాఖపట్నం-గుంటూరు (17240) రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా దారి మళ్లించారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. 

 

మరోవైపు తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే కొన్ని రైళ్లు రద్దు చేయగా.. మరికొన్ని దారి మళ్లించారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 20 వరకు డోర్నకల్‌-విజయవాడ, భద్రాచలంరోడ్డు-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ 11 నుంచి 21 వరకు రద్దు చేశారు. ఈ నెల 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్‌ (12705/12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. ఈ నెల 11, 14, 16, 18, 19, 20 తేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్‌ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. 19, 20 తేదీల్లో సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20834) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు ఆలస్యంగా.. ఈ నెల 9, 11, 14, 18, 19 తేదీల్లో ఆదిలాబాద్‌-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 90 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతాయి. ప్రయాణికులు ఈ రైళ్లు రద్దు అంశాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama